రైతుల పక్షాన పోరాడుదాం
విజయనగరం: కూటమి ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై వారి పక్షాన నిలిచి పోరాటం చేద్దామని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ఎరువుల కోసం రైతులు ఎదుర్కొంటున్న అవస్థలను గుర్తించిన వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీన రెవెన్యూ డివిజన్ అయిన చీపురుపల్లి ఆర్‌డీవో ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించాలన్నారు. 9వ తేదీన చీపురుపల్లి లో నిర్వహించనున్న ధర్నాకు సంబంధించి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రాజాం నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ ఇంచార్జి డా.తలే రాజేష్, రాజాం నియోజకవర్గ ముఖ్య నాయకులుతో గరివిడి పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఆ రోజు 9:30 గంటలకు రాజాం నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు చీపురుపల్లి పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోవాలని సూచించారు. అక్కడ నుంచి ర్యాలీ గా బయలుదేరి ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని రైతుల ఎరువులు కష్టాలపై ఆర్డీఓ కి వినతిపత్రం అందజేస్తామన్నారు.
సమావేశంలో మాజీ పార్లమెంటు సభ్యుడు, రాష్ట్ర పీఏసీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ రావు, రాజాం నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ ఇంచార్జి డా. తలే రాజేష్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహన్ రావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు టంకాల అచ్చెన్నాయుడు, జడ్పీటీసీ బండి నరసింహులు, వంగర ఎంపీపీ ఉత్తరావిల్లి సురేష్ ముఖర్జీ, రాజాం టౌన్ మరియు నాలుగు మండలాలవైయస్ఆర్‌సీపీ పార్టీ అధ్యక్షులు పాలవలస శ్రీనివాస రావు, లావేటి రాజగోపాల్ నాయుడు, గరుగుబిల్లి స్వామి నాయుడు, వైస్ ఎంపీపీ యాలాల వెంకటేష్ , సర్పంచ్లు టoకాల ఉమాపాపినాయుడు,బొక్కెల వెంకట అప్పలనాయుడు, సలాది సతీశ్, బురాడ వెంకట రావు మరియు రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.