శాసనమండలిలో ప్రతిపక్షనేతగా బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

21 Aug, 2024 22:39 IST

తాడేపల్లి: విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించిన  బొత్స సత్యనారాయణను శాసనమండలిలో ప్రతిపక్షనేతగా పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం  వైయస్‌.జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈమేరకు ఆయన శాసనమండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు. అలాగే శాసనమండలిలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని నియమిస్తూ శాసనమండలి సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు.