టీటీడీ ప్రతిష్టను మంటగలిపిన బీఆర్ నాయుడు
తాడేపల్లి: పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అరాచక శక్తులకు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చిన బీఆర్ నాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ తీరుపై, టీటీడీ ప్రస్తుత చైర్మన్ బాగోతాలపై నిప్పులు చెరిగారు. బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత టీటీడీ ఔన్నత్యం పూర్తిగా మంటగలిసిపోయిందని, ఆయన చేస్తున్న వికృత కామ క్రీడలు చూసి హిందూ సమాజం ఈసడించుకుంటోందని మండిపడ్డారు. వేద ఘోష వినిపించాల్సిన చోట ఆయన పెంచుకుంటున్న 'ఆకు రౌడీలు బూతులు వినిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు నాయుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక మర్మమేంటి?" అని నిలదీశారు. వికృత చేష్టలకు పాల్పడిన బీఆర్ నాయుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి, లేనిపక్షంలో ప్రభుత్వం ఆయన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. "టీటీడీ గౌరవాన్ని కాపాడటం కోసం హిందూ సమాజం చేసే పోరాటాన్ని వైయస్ఆర్‌సీపీప్రతిబింబిస్తుందని, న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు" అని కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే...
తిరుమల పవిత్రతను మంట గలిపిన బీ ఆర్ నాయుడు...
పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఓలలాడాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం బీ ఆర్ నాయుడు పాలకమండలి అధ్యక్షుడు అయిన తర్వాత అరాచక శక్తుల, అసాంఘిక కార్యక్రమాలతో తల్లడిల్లిపోతుంది. బీ ఆర్ నాయుడు వచ్చిన తర్వాత టీటీడీ ఔన్నత్యం, విశిష్టత పూర్తిగా మంటగలిసిపోయాయి. ఆయన చేస్తున్న వికృతకామ క్రీడలు బయటకు వచ్చిన తర్వాత మొత్తం హిందూ సభ్య సమాజం అంతా ఈసడించుకుంటున్నారు. పాలకమండలి చైర్మన్ పదవికి బీ ఆర్ నాయుడు అనర్హుడని, ఆయన రాజీనామా చేయాలని లేనిపక్షంలో టీటీడీ నుంచి గెంటి వేయాలని హిందువులు గొంతెత్తి నినదిస్తున్నా కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులను వెనకేసుకుని రావడం వల్ల బీ ఆర్ నాయుడు తాను చేస్తున్న కార్యక్రమాల వల్ల, ఆ వికృత చేష్టలను బలపరిచే ఆకు రౌడీలంతా ఆయన పంచన చేరారు. వాళ్లందరికీ బీ ఆర్ నాయుడు ఇష్టమొచ్చినట్లుగా దర్శనాలకు సంబంధించిన వెసులుబాటు కల్పించడంతో రోజుకు 3-4 వేల వరకు రూ.300 సుపధం టిక్కెట్లు, వీ ఐ పీ బ్రేక్ దర్శనాలు వేలాది రూపాయలకు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటూ రోజుకూ లక్షలాది రూపాయలు సంపాదించుకుంటున్న ఆకు రౌడీలు పేట్రేగిపోతున్నారు.
మీరు చేసిన అసాంఘిక కార్యక్రమం నైతికంగా సరైన చర్య కాదని... బీ ఆర్ నాయుడుపై నిరసన కార్యక్రమం చేస్తే ఆయన పెంచుతున్న ఆకు రౌడీలు.. ఆ కార్యక్రమంలో పాల్గొన్నమహిళలపై అత్యంత నీచంగా, అసభ్యంగా దుర్భాషలాడుతూ వారిని రక్కడంతోపాటు, 13 మంది మహిళలపై ఎస్సీ, ఎస్టీ తప్పుడు కేసులు బనాయించారు. పైగా ఇళ్ల నుంచి బయటకు పోనివ్వమని, ఊర్లలో ఉండనివ్వమని బెదిస్తున్నారు.
వేద ఘోష వినిపించాల్సిన చోట పచ్చి బూతులు...
పీఠాధిపతులు, మఠాధిపతులు, మతాధిపతులు, ఆచార్యపురుషుల అద్భుతమైన ప్రవచనాలు, అనుగ్రహ భాషణాలు, ప్రసంగాలతో ఎంతో పవిత్రంగా భాసిల్లాల్సిన తిరుమల తిరుపతి ఇవాళ బీ ఆర్ నాయుడు పెంచిన పెంచుతున్న పెంపుడు కుక్కలు, ఆకు రౌడీల బూతులతో నిండిపోయింది. బీ ఆర్ నాయుడుని ఏ రాజకీయ పార్టీ వ్యక్తులు సమర్థించడం లేదు. సంఘంలో అంతా ద్వేషిస్తున్నారు. బీ ఆర్ నాయుడతో పాటు ఆకు రౌడీల బెదిరింపులకి ఎవరూ భయపడేది లేదు. ఇలాంటి త్రాష్టులను ఏభై ఏళ్ల క్రితమే ఉద్యమకారుడిగా నా కాలుకింద చెప్పుతో నలిపివేసిన వ్యక్తిగా చెబుతున్నాను. దుర్మార్గులకు ద్రోహులకు వ్యతిరేకంగా మంచి వాళ్లు చేస్తున్న పోరాటంలో అగ్ర భాగాన ఉండి... సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ....
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మహిళల పెదవులను రక్కడం అంటే అత్యాచార యత్నం కిందే లెక్క. ఇంత కంటే దారుణం ఏముంటుంది. తిరిగి బాధిత మహిళలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దారుణం. ఇవన్నీ బీఆర్ నాయుడు పెంపుడు కుక్కుల్లా వ్యవహరిస్తున్న ఆకు రౌడీల పనే. వీరందరనీ బీ ఆర్ నాయుడే ఉసిగొల్పుతున్నాడు.
టీటీడీ పాలక మండలి అధ్యక్షుడి గౌరవాన్ని, టీటీడీ ప్రతిష్టను దిగజార్చిన బీ ఆర్ నాయుడు రాజీనామా చేసేంతవరకు హిందూ సమాజం ఈ పోరాటం చేస్తూనే ఉంటుంది. హిందూ సంఘాల ఆవేదనను, కోపాన్నే వైయస్ఆర్‌సీపీ ప్రతిబింబిస్తుందని కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు.