కరోనా నియంత్రణపై సమీక్ష ప్రారంభం
22 Jun, 2020 13:04 IST
తాడేపల్లి: కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశం చర్చించనున్నారు.