బడుగుల ఆత్మగౌరవం జగనన్న
పాలకొల్లు : సామాజిక సాధికార బస్సుయాత్ర ఆసాంతం జై జగన్ నినాదాలతో పాలకొల్లు మారుమోగిపోయింది. బడుగు, బలహీన వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. సామాజిక సాధికార బస్సు యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పినిపె విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ నందిగం సురేష్, శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు,ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లో సీఎం వైయస్ జగన్ ఆత్మగౌరవం నింపారని నేతలు చెప్పారు. ఐదుగురు ఎస్సీలను మంత్రుల్ని చేసిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. బస్సు యాత్రలో నేతలు ఏమన్నారంటే..
మంత్రి పినిపె విశ్వరూప్ మాట్లాడుతూ....
2014–19 మధ్యలో చంద్రబాబు పాలనను, 2019–23 నవంబర్ వరకు జగనన్న పాలనను ఒక్కసారి బేరీజు వేసుకోండి. రాష్ట్రంలో అవ్వాతాతలు రూ.2,750 పింఛన్ తీసుకుంటున్నారు. వచ్చే జనవరి నుంచి రూ.3 వేలు అందుకోబోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం నాడు వైయస్సార్, నేడు సీఎం జగన్.
– 2014–19 వరకు చంద్రబాబు ఇచ్చిన పింఛన్లు 30 లక్షలు. ఈరోజు 64 లక్షల మందికి జగనన్న పింఛన్లు ఇస్తున్నారు.
– ఫీజు రీయింబర్స్‌మెంట్ 30 శాతానికి చంద్రబాబు తగ్గించారు. ప్రజల్ని మోసం చేశాడు.
– డ్వాక్రా అక్కచెల్లెమ్మలు రుణాలు కట్టొద్దని, మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశాడు. కానీ జగనన్న నాలుగు విడతల్లో మీ ఖాతాల్లో జమ చేస్తున్నారు.
– చెప్పిన ప్రతి మాటా నెరవేర్చిన నాయకుడు జగనన్న. ఎన్నికల కోసమే వాగ్దానాలిచ్చే వ్యక్తి చంద్రబాబు.
– నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ఆత్మగౌరవం నింపిన జగనన్న.
– టీడీపీ హయాంలో ముగ్గురు ఎస్సీ మంత్రులుంటే నేడు జగనన్న ఐదుగురు ఎస్సీలకు అవకాశం కల్పించారు.
– ఎస్టీలకు చంద్రబాబు ఐదేళ్లలో మంత్రి పదవే ఇవ్వలేదు.
– ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలకు ఉపముఖ్యమంత్రి పదవులిచ్చిన జగనన్న.
– సీఎం జగన్ ఏ విధంగా పింఛన్లు పెంచారో, అంచలంచెలుగా తాము కూడా పెంచుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలోనే అత్యుత్తమ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగనన్న.
– ప్రతి ఒక్కరూ చదువుకునేందుకు అవకాశం కల్పించిన జగనన్న అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నారు.
– ఈ సంక్షేమ పాలన ఇక్కడితో ఆగకూడదు. 2024 తర్వాత కూడా కొనసాగాలి.
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ...
– చంద్రబాబు నాయుడు అంటే అబద్ధం. నిజం మాట్లాడని వాడు. నయవంచకుడు.
– చంద్రబాబు పాలనలో మనవాళ్లను కులవృత్తులకే పరిమితం కావాలన్నాడు.
– 2004 తర్వాత వైయస్ రాజశేఖరరెడ్డి వచ్చి ఆలోచించాడు.
– ఇవాళ మన పిల్లలు ఇంజనీరింగ్,వైద్యవిద్యను చదువుతున్నారు. విదేశాలకు వెళ్తున్నారు. రాజశేఖరరెడ్డి ఫీజురీయింబర్స్‌మెంట్ పెట్టకపోతే ఇది సాధ్యమయ్యేదా?
– విభజిత రాష్ట్రంలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికి రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి అందర్నీ మోసగించాడు.
– ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని ఇచ్చాడా? నిరుద్యోగ భృతి ఇచ్చాడా?
– రైతులకు రుణాలు మాఫీ చేశాడా? రూ.87 వేల కోట్లు మాఫీ అని రూ.15 వేల కోట్లే చేశాడు.
– అబద్ధం ఆడితే వచ్చే అధికారం తనకొద్దని జగనన్న చెప్పాడు.
– రాజకీయ నాయకుడు నిజమే చెప్పాలని చెప్పిన ఏకైక నాయకుడు జగనన్న.
– చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేశాడా? కానీ జగనన్న నాలుగు దఫాల్లో మీ ఖాతాల్లో వేస్తున్నాడు. అందుకే జగన్ నిజం, చంద్రబాబు అబద్ధం.
– మొన్నటిదాకా సర్పంచ్ కూడా కాని నేను ఇవాళ రాష్ట్రమంత్రి అయ్యానంటే కారణం జగనన్న.
ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ...
– మన పిల్లలు చదువుకోవాలంటే కచ్చితంగా జగనన్న రావాలి.రాష్ర్టంలో రైతులు బాగుండాలంటే, నాడు – నేడు స్కూళ్లు బాగుండాలంటే, ప్రతి పేదవాడి పిల్లాడూ ఐఏఎస్, ఐపీఎస్‌లు అవ్వాలంటే, మంచి వైద్యం కావాలంటే, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు బాగుండాలంటే జగనన్న కావాలి.
– బీసీల సమస్యలు ప్రస్తావిస్తే చంద్రబాబు తోకలు కత్తిరిస్తానన్నాడు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నాడు. ఎస్సీలు చంద్రబాబుకు ఓట్లేస్తారా?
– మైనార్టీలను వైయస్ రాజశేఖరరెడ్డి మరువలేదు. చంద్రబాబు గుర్తుపెట్టుకోలేదు.
– చంద్రబాబు మన జీవితాలతో ఆడుకున్నాడు. సంపద దోచుకుని సింగపూర్, మలేషియాలో దాచాడు.
–వంగవీటి రంగాను పొట్టనపెట్టుకున్న చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కలిసిపోతున్నాడు.
– ఇవాళ సురేష్ అనే వాడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడంటే జగనన్నే కారణం.
– అమరావతి ప్రాంతంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలపై కేసులు పెట్టి జైల్లో కూర్చోబెట్టాడు చంద్రబాబు.
– జగనన్న వచ్చిన తర్వాత... ఎస్సీలంటే, బీసీలంటే, మైనార్టీలంటే గౌరవం, రోషం కలిగిన వాళ్లు, వాళ్లు కూర్చోవాల్సింది పార్లమెంటులో అని అక్కడ కూర్చోబెట్టారు.
– నన్ను డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌ను చేసిన ఘనత జగనన్నది.
– విజయవాడలో నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం తాడేపల్లివైపు చూపిస్తుంటుంది. నా ఆశయాలతో మీ జీవితాల్ని బాగు చేసే వ్యక్తి తాడేపల్లిలో ఉన్నాడని చూపిస్తుంటుంది.
– భవిష్యత్‌లో జగనన్న ముఖ్యమంత్రిగా 20–25 సంవత్సరాలు ఉండాలి. మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేదాకా అండగా ఉంటారు.
– చంద్రబాబు 600 హామీలిచ్చి 10 కూడా నెరవేర్చలేదు. జగనన్న నవరత్నాల ద్వారా 99 శాతం హామీలు నెరవేర్చారు.
శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, మాట్లాడుతూ....
– ఇవాళ పేద పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుతూ మాట్లాడుతుంటే పట్టరాని సంతోషంగా ఉంది.
– నవరత్నాల ద్వారా వందకు 80 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు లబ్ధి పొందుతున్నారు.
– రాజకీయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా ఉన్న జగనన్న.
– 17 మంత్రి పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన జగనన్న. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంత మంది లేరు.
– ఎస్సీనైన నన్ను శాసనమండలి చైర్మన్‌గా, బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని శాసనసభాపతిగా నియమించారు.
– స్థానిక సంస్థల్లో ఓసీ స్థానాల్లో కూడా ఎస్సీలు, బీసీలకు అదనంగా జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లుగా,మేయర్లుగా ఇచ్చిన ఘనత జగనన్నది.