బద్వేల్లో వైయస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం
21 Oct, 2021 11:14 IST
వైయస్ఆర్ జిల్లా: బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైయస్ఆర్సీపీ అభ్యర్థిని డాక్టర్ సుధను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభ్యర్థించారు. పార్టీ నేతలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కడప రత్నాకర్, తదితరులతో కలిసి పెద్దిరెడ్డి పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగేమహానందిపల్లి, పెండ్లిమర్రి, చెన్నారెడ్డి పల్లి, శంఖవరం గ్రామాల్లో ఎన్నికల ఇన్చార్జి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు మండల నాయకులు వైయస్ఆర్సీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు.