బీఏసీ సమావేశం ప్రారంభం
30 Nov, 2020 10:55 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ఇవాళ ఉదయం ప్రారంభమయ్యాయి. సంతాప తీర్మానం అనంతరం సభను వాయిదా వేసిన స్పీకర్ తమ్మినేని సీతారామ్ తన చాంబర్‌లో శాసనసభ కార్యకలాపాల సలహా మండలి (బీఏసీ) సమావేశం నిర్వహించారు. శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు జరిగేది, చర్చించాల్సిన అజెండా అంశాలను ఖరారు చేస్తారు. ఈ సమావేశానికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కన్నబాబు, అనిల్‌కుమార్‌యాదవ్ హాజరు కాగా, ప్రతిపక్ష నేత చంద్రబాబు డుమ్మా కొట్టారు. ఎక్కువ రోజులు జరగాల్సిన సాధారణ బడ్జెట్ సమావేశాలు కరోనా మహమ్మారి వల్ల గత జూన్ నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇపుడు ఐదు రోజులు జరుగుతాయని భావిస్తున్న శీతాకాల సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.