సాలూరులో బాబు ష్యూరిటీ... అబద్ధాలు గ్యారెంటీ
10 Jul, 2025 18:50 IST
సాలూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు సాలూరు మండలం మావుడి పంచాయతీలో బాబు ష్యూరిటీ.. అబద్ధాలు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆధ్వర్యంలో ఇంటింటా పర్యటించి చంద్రబాబు చేసిన మోసాలను, పథకాలు , హామీలు ఇవ్వడంలో చేసిన మోసాలను వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామస్తులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.