భవిష్యత్తు వైయస్ఆర్‌సీపీదే..
నెల్లిమర్ల: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమప్రాధాన్యతగా అందాలంటే వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్(పెదబాబు), నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకోండ అప్పలనాయుడు అన్నారు. పూసపాటి రేగా మండలంలో బాబు ష్యురిటీ -మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన ఏడాదిలోనే కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుందన్నారు. దగా పడిన రాష్ట్ర ప్రజలు జగన్ 2.0 కోసం ఎదురుచూస్తున్నారన్నారు. భవిష్యత్తు వైయస్ఆర్‌సీపీదేనని గుర్తుచేశారు. ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేసేలా కార్యచరణ సిద్దం చేసుకోవాలన్నారు. కూటమి సర్కార్ అమల్లోకి తీసుకొచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగంపై భయపడాల్సిన పనిలేదన్నారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా అందరూ కలసికట్టుగా పోరాటం సాగించాలన్నారు.