మూడో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
25 Sep, 2023 10:26 IST
అసెంబ్లీ: మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభమైంది. నేడు సభలో మహిళా సాధికారతపై చర్చించనున్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీ తీర్మానం చేయనుంది. అనంతరం అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ, భూ సంస్కరణలపై చర్చ సాగనుంది. మరోవైపు 10 గంటలకు శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి చర్యలపై చర్చించనున్నారు.