వైయస్ఆర్‌సీపీ నేతపై ‘పులివర్తి' అనుచరుల హత్యాయత్నం
తిరుపతి జిల్లా: పాకాల మండలం, ఆదెనపల్లి పంచాయతీ శ్రీనివాసపురానికి చెందిన వైయస్ఆర్‌సీపీ రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవనాయుడుపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు దాడికి తెగ బడ్డారు. చంద్రగిరి మండలం తొండవాడ సమీపం లోని ఓ కల్యాణ మండపంలో తమ బంధువు వివాహానికి ద్విచక్ర వాహనంపై శుక్రవారం మాధ వనాయుడు బయల్దేరారు. కల్యాణ మండపం సమీపంలోని స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న శ్రీసా ఆలయం వద్ద నాని అనుచరులు ఆరుగురు అట కాయించి మాధవ నాయుడును ఆపి కాళ్లతో తన్నుతూ విచ క్షణారహితంగా పిడి గుద్దులు గుద్దారు. దీంతో అతనికి ముక్కు, నోటి నుంచి రక్తం కారుతున్నా నోట్లో పళ్లు ఊడి పోయి అరుస్తున్నా వదలలేదు. అత్యంత పాశవికం దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు. అయితే, వాహనదారులు దాడిచేస్తున్న వారిని పట్టుకునేం దుకు యత్నించగా వారు పరారయ్యారు. తీవ్ర రక్తగాయాలతో మాధవనాయుడు చంద్రగిరి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు ఆయన్ను చంద్రగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తనపై జరిగిన హత్యాయత్నానికి ఎమ్మెల్యే అనుచరుడు రామిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.