విజయనగరంలో జలాసన ప్రదర్శన కార్యక్రమం
11 Jul, 2023 11:21 IST
విజయనగరం: జాతీయ స్విమ్మింగ్ దినోత్సవం సందర్భంగా విజయనగరం పట్టణంలో ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో స్థానిక శాసనసభ్యులు, శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జలాసన ప్రదర్శన కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర , శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం, పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణ దాస్, వెంకట చిన అప్పలనాయుడు, బొత్స అప్పల నరసయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, శాసనమండలి సభ్యులు డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, ఇందుకూరి రఘు రాజు తదితరులు పాల్గొన్నారు.