సీఎంకు ఆర్టీసీ నిపుణుల కమిటీ నివేదిక
27 Sep, 2019 15:05 IST
అమరావతి : ఎలక్ట్రిక్ బస్సులపై నియమించిన ఆర్టీసీ నిపుణుల కమిటీ తన నివేదికను శుక్రవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించింది. ఈ విధానంపై కమిటీ కొన్ని కీలక సిఫారసులను చేసింది.
- పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చి అందుకు అవసరమైన ఆదాయ వనరులను వివిధ మార్గాల ద్వారా సమీకరించుకోవాలి.
- ఆర్టీసీ ఛార్జింగ్ పాయింట్ల వద్ద సోలార్ పవర్ కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్టీసీ కాంప్లెక్స్ల వద్ద అనుకూలంగా ఉన్న చోట సోలార్ పవర్ రూఫ్లను ఏర్పాటు చేసుకోవాలి.
- తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలిపిరి, తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు భూములు కేటాయించాలి.
- ఈ బస్సు టెండర్లలో రివర్స్ టెండరింగ్ పద్దతిని అనుసరించడం ఉత్తమం.
- ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కమిటీ చైర్మన్ ఆంజనేయరెడ్డి, కమిటీ సభ్యులు, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఉన్నారు.