ఫైబర్ గ్రిడ్ స్కామ్‌లో లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు
21 Sep, 2020 14:14 IST
విజయవాడ: ఫైబర్ గ్రిడ్ స్కామ్‌లో నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయాడని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా అన్నారు. తండ్రి శాఖలో ఫైల్‌పై లోకేష్ ఎందుకు సంతకం పెట్టారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. ఫైబర్ గ్రిడ్ స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమరావతిలోనూ చంద్రబాబు, లోకేష్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. అమరావతిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. టీడీపీ నేతలు, ఓ సామాజికవర్గం వాళ్లే అమరావతిలో భూములు ఎలా కొనగలిగారని ప్రశ్నించారు. అమరావతి చంద్రబాబుకు ఏటీఎం అని ప్రధాని మోడీనే చెప్పారని గుర్తుచేశారు. అందుకే ప్రధానిని సీబీఐ విచారణ వేయాలని కోరుతున్నామన్నారు.