విద్యాశాఖలో మరో కీలక సంస్కరణ
17 Sep, 2022 15:38 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో మరో కీలక సంస్కరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంఈఓ-2 పోస్టులను మంజూరు చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి 679 ఎంఈఓ-2 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పాఠశాలల నిర్వహణ కోసం ఈ అదనపు ఎంఈవోల నియామకం చేపట్టారు.