ఏపీ ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్
18 Apr, 2019 15:07 IST
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధర్మాన కృష్ణదాస్ ఎంపికయ్యారు. గురువారం తిరుపతిలో ఆ సంఘం జనరల్ బాడీ వార్షిక సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీ అధ్యక్షుడిగా కృష్ణదాస్ ఎంపికయ్యారు. ఈయన గతంలో శ్రీకాకుళం జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కృష్ణదాస్ ఎంపిక కావడం పట్ల ఆ సంఘం నాయకులు, వైయస్ఆర్‌సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.