ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకం
14 Sep, 2021 14:57 IST
తాడేపల్లి: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకం జరగాలని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చెయ్యడం కోసమే ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే టీడీపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఈ మేరకు సచివాలయంలో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సినిమా టికెట్ల వివాదాన్ని త్వరలో పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం టిక్కెట్ల వ్యాపారం చేస్తుందని ప్రతిపక్షం నోటికొచ్చినట్లు మాట్లాడుతుందని మండిపడ్డారు. సినిమా టికెట్లను పారదర్శకంగా ప్రజలకు అందిస్తామన్నారు. నిబంధనలకు లోబడే షోలు జరగాలని మంత్రి స్పష్టం చేశారు.