నేడు కేంద్రమంత్రులతో మంత్రి గౌతమ్‌రెడ్డి భేటీ
12 Nov, 2021 11:12 IST
న్యూఢిల్లీ: రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలు, పెట్టుబడులే ధ్యేయంగా పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌తో భేటీ అయిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి.. కొప్పర్తిలో టెక్స్‌టైల్ పార్కుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్రమంత్రితో చర్చించారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్రమంత్రి సరబనాథ్ సోనోవాల్‌తో గౌతమ్‌రెడ్డి భేటీ కానున్నారు. అదే విధంగా 3.30 గంటలకు కేంద్రమంత్రి రాజ్‌కుమార్ సింగ్‌తో సమావేశమవుతారు. సాయంత్రం 5 గంటలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెండ్‌తో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భేటీ అవుతారు.