ఏపీ ఫైబర్ నెట్ సేవలను పల్లెలకు విస్తరిస్తాం
విశాఖ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఏపీ ఫైబర్ నెట్ సేవలను పల్లెలకు విస్తరిస్తామని ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ పి.గౌతంరెడ్డి తెలిపారు. విశాఖలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంకేతిక విప్లవం తీసుకువస్తామన్నారు. క్వాలిటీతో కూడిన ఇంటర్ నెట్ సేవలు అందిస్తామని చెప్పారు.నెట్, పోల్ ఉచితంగా అందిస్తామన్నారు. ఏపీ ఫైబర్ నెట్ వర్క్ సేవలు మరింత పటిష్టం చేస్తామన్నారు.ప్రతి పల్లెకు ఇంటర్ నెట్ సేవలు, గూగుల్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతమున్న బ్యాండ్ విడ్త్ స్పీడ్ పెంచుతామని పేర్కొన్నారు. 10 లక్షల కనెక్షన్లు ఉన్న వాటిని 50-70 లక్షల కనెక్షన్లు లక్ష్యంగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్‌లోలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని, వీటిపై విచారణ జరుగుతోందని గౌతంరెడ్డి పేర్కొన్నారు.