‘కుల గణన’ నిర్ణయంపై వైయ‌స్‌ జగన్‌ హర్షం

1 May, 2025 14:32 IST

తాడేప‌ల్లి: జన గణనతో పాటే కుల గణన చేయాలన్న కేంద్రం నిర్ణయంపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) హర్షం వ్యక్తం చేశారు. గురువారం తన ఎ‍క్స్‌ ఖాతాలో చేసిన పోస్టులో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.  అలాగే.. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో కుల గణనను నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

`ఎక్స్‌` వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..
`కుల గణన చేయాలనే కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. 2021లోనే మా ప్రభుత్వ హయాంలోనే కుల గణనపై  తీర్మానం చేశాం. జనవరి 2024లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దేశంలో మొట్టమొదటి బీసీ కుల గణనను నిర్వహించాం. కుల గణన ద్వారా వెనుకబడిన,  అణగారిన వర్గాలకు మరింత సంక్షేమాన్ని అందించవచ్చు. సమాజంలోని అన్ని వర్గాలకు నిజమైన సామాజిక న్యాయాన్ని, అభివృద్ధిని అందించటంలో ఇది ఇది కీలకమైన అడుగు` అని వైయ‌స్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు.