ఏపీఈఏపీ సెట్‌ ఫలితాలు విడుదల

14 Sep, 2021 12:02 IST

 విజయవాడ: రాష్ట్రంలోని అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈఏపీ సెట్‌ బైపీసీ స్ట్రీమ్‌ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 92.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు.
 


మొదటి ర్యాంకు- చందం విష్ణు వివేక్‌(తూర్పుగోదావరి- కోరుకొండ)
రెండో ర్యాంకు- శ్రీనివాస కార్తికేయ(అనంతపురం)
మూడో ర్యాంకు- బొల్లినేని విశ్వాస్‌రావు(హన్మకొండ)