సీఎం వైయస్ జగన్‌తో డీజీపీ సవాంగ్ భేటీ
31 May, 2019 10:57 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని నూతన ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) గౌతమ్ సవాంగ్ శుక్రవారం కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా సీఎంతో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పూర్తి అదనపు బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్‌కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొనసాగుతారు. అలాగే నలుగురు ఐపీఎస్‌ల బదిలీలకు సంబంధించి రెండు జీవోలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి విడుదల చేసింది. ఇప్పటిదాకా డీజీపీగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్, పర్ఛేజ్ కమిషనర్‌గా బదిలీ చేశారు.