శాస‌న మండ‌లిలోకి తొలిసారిగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

17 Jun, 2019 12:45 IST

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి శాసనమండలిలో అడుగుపెట్టారు. శాసనమండలి సమావేశం సందర్భంగా ఆయన సభలోకి రాగా.. సభ్యులంతా గౌరవసూచకంగా నిలబడి స్వాగతం పలికారు. శాసనమండలి చైర్మన్ షరీఫ్ ఆహమ్మద్ మహమ్మద్‌, టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ యనమల రామకృష్ణుడితో పాటు సభ్యులందరికి వైయ‌స్‌ జగన్‌ అభివాదం చేసారు. టీడీపీ ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్‌కు వైయ‌స్‌ జగన్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. అనంతరం గవర్నర్‌ ప్రసంగంపై చర్చ కొనసాగింది.