రెవెన్యూ శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
14 Aug, 2019 12:13 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూముల రీసర్వే చేపట్టడం ద్వారా భూ రికార్డులను ప్రక్షాళన చేయడం, కౌలుదారుల రక్షణ చట్టంపై భూయజమానులకు అవగాహన కల్పించడంపై సీఎం ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.