మొహర్రం స్ఫూర్తిగా మానవతావాదానికి పునరంకితమవుదాం
29 Aug, 2020 10:18 IST
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు. ‘మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి ప్రతీక మొహర్రం. ధర్మ పరిరక్షణ, మానవసేవ, త్యాగం వంటి మహత్తర సందేశాన్ని మొహర్రం గుర్తు చేస్తుంది. మొహర్రం స్ఫూర్తిగా మనమంతా మానవతావాదానికి పునరంకితమవుదాం’ అని ట్విటర్ వేదికగా సీఎం వైయస్ జగన్ సందేశం ఇచ్చారు.