సాయంత్రం గవర్నర్‌తో సీఎం భేటీ
22 Jun, 2020 14:36 IST
విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సోమవారం భేటీ కానున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆయనను మర్యాదపూర్వకంగా కలువనున్నారు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రసంగించిన విషయం తెలిసిందే