రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
22 Sep, 2019 20:10 IST
అమరావతి : రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సోమవారం హైదరాబాద్ రానున్నారు. రేపు సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్తో ఆయన ప్రగతిభవన్లో భేటీ అవుతారు. ఇరు రాష్ట్రాల జల వనరులు, ఇతర అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ఇంతకు ముందు కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయిన విషయం తెలిసిందే. కాగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ రేపు ఉదయం తాడేపల్లి నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్తారు.