మల్లు స్వరాజ్యం మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జగన్‌ సంతాపం

20 Mar, 2022 17:48 IST

 తాడేప‌ల్లి:  తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి పట్ల ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మల్లు కుటుంబ సభ్యులకు ఆయన ఓ ప్రకటనలో ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. స్వాతంత్య్ర సమరయోధురాలుగానే కాక సామాజిక, రాజకీయ సమస్యలపై అనేక పోరాటాలు చేసిన ఉద్యమకారిణి మల్లు స్వరాజ్యం అని వైయ‌స్ జగన్‌ గుర్తు చేసుకున్నారు. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణ, విలువలతో ఆమె జీవితకాలం మొత్తం జీవించారని కొనియాడారు.