సీఎం వైయస్ జగన్‌ను కలిసిన సివిల్స్ అభ్యర్థులు
30 Apr, 2022 11:10 IST
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత మిధున్‌రెడ్డి, ఎంపీలు అయోధ్యరామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గురుమూర్తి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని సివిల్స్ అభ్యర్థులు కలిశారు. ఏపీలో నాడు–నేడు స్కూళ్ల అభివృద్ధిపై వారు సీఎం వైయస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.