మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ మృతి పట్ల సీఎం వైయస్ జగన్ సంతాపం
29 Jan, 2023 17:52 IST
తాడేపల్లి: మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వసంత్ కుమార్ ఆదివారం తెల్లవారు జామున వైజాగ్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూళ్ళ గ్రామం.