నేడు కేంద్ర న్యాయశాఖ మంత్రితో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ 

15 Feb, 2020 11:27 IST

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను  కలవనున్నారు. శాసనమండలి, కర్నూలుకు హైకోర్టు తరలింపు తదితర అంశాలపై ఆయనతో చర్చించన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీరి భేటీ ఉండనుంది. ఇక శుక్రవారం హోంమంత్రి అమిత్‌షాను కలిసిన సీఎం వైఎస్‌ జగన్‌ దాదాపు 40 నిముషాలపాటు చర్చించారు. మూడు రోజులు క్రితం ప్రధాని మోదీని కలిసిన సీఎం వైయస్‌ జగన్‌ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వివరించిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి నిధులు కేటాయింపులోనూ చొరవ చూపించాలని ఆయన ప్రధానిని కోరారు.