డాక్టర్ అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం
27 Jul, 2021 15:09 IST
తాడేపల్లి: దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. నేడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. అబ్దుల్ కలాం 6వ వర్ధంతి సందర్భంగా సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.