కాసేపట్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం
8 Feb, 2023 10:46 IST
సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగనుంది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు ప్రతిపాదనలను కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలపనున్నారు. సుమారు రూ. లక్షా 45 వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.