ముగిసిన కేబినెట్ భేటీ
సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలపై మంత్రివర్గ సభ్యులు సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపారు. నవరత్నాల్లో మరో హామీ అమలుకు సీఎం వైయస్ జగన్ నిర్ణయించారు. వైయస్ఆర్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆసరా పథకం ద్వారా నాలుగేళ్లలో 27 వేల కోట్లకుపైగా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా సెప్టెంబర్ 1న వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం, సెప్టెంబర్ 5న వైయస్ఆర్ విద్యాకానుక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా నూతన పారిశ్రామిక విధానానికి, పంచాయతీ రాజ్ శాఖలో 51 డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారుల పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 11న వైయస్ఆర్ ఆసరా పథకం ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.