అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ స్పీకర్‌గా వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు నోటిఫికేషన్ విడుదల చేశారు. స్పీకర్‌గా ఇప్పటికే తమ్మినేని సీతారాం పేరును ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు. దీంతో స్పీకర్ పదవికి తమ్మినేని సీతారాం నామినేష్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 30 మంది సభ్యులు మద్దతు పలికారు. ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపు అధికారికంగా ప్రొటెం స్పీకర్ ప్రకటిస్తారు. స్పీకర్‌గా తమ్మినేని గురువారం అధికారికంగా భాధ్యతలు చేపట్టనున్నారు. తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది.