అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు ప్రారంభం
21 Sep, 2022 09:39 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు ప్రారంభం అయ్యాయి. ఇవాళ సభలో ప్రభుత్వం తొమ్మిది బిల్లులను ప్రవేశపెట్టనుంది. వ్యవసాయ అనుబంధ రంగాలపై చర్చ సాగనుంది. ప్రశ్నోత్తరాలు చేపట్టారు శాసనసభ స్పీకర్ తమ్మినేని. అయితే.. సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే టీడీపీ సభ్యులు గొడవకు దిగారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకునే యత్నం చేస్తున్నారు. 2020-21 సీజన్ కాగ్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టనున్న మంత్రి బుగ్గన.