ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
15 Sep, 2022 09:38 IST
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలతో సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రశ్నోత్తరాల అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది. సభలో ఏయే అంశాలు చర్చించాలో నిర్ణయించనున్న బీఏసీ సమావేశం. తొలి రోజు శాసన సభలో పరిపాలనా వికేంద్రీకరణపై చర్చించే అవకాశం. అలాగే పరిపాలన వికేంద్రీకరణపై సీఎం వైయస్ జగన్ కీలక ప్రసంగం చేయనున్నారు.