వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం
16 Mar, 2023 09:46 IST
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2023-24 వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో బడ్జెట్‌ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. రూ.2.79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ఉండే అవకాశముంది. మండలిలో బడిప్యూటీ సీఎం అంజాద్ బాషా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రూ. 2. 79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ఉండే అవకాశం. నవరత్నాలకు నిధుల కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యం. మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ జెండర్ బేస్డ్ బడ్జెట్. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు. వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమ, పేదల ఇళ్లకు పెద్దపీట. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఉన్నట్లు సమాచారం