దివంగత మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ ఘన నివాళి
17 Mar, 2023 10:53 IST
అసెంబ్లీ: ఇటీవల మరణించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మాజీ సభ్యులకు శాసనసభ ఘన నివాళులు అర్పించింది. మాజీ సభ్యుల మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. సంతాప ప్రతిపాదనలు స్పీకర్ తమ్మినేని సీతారాం చదివి వినిపించారు. అసెంబ్లీ మాజీ సభ్యులు బిక్కిన గోపాలకృష్ణ, చుక్క పీటర్‌పాల్, కొలుసు పెద్ద రెడయ్య యాదవ్, వట్టి వసంతకుమార్, డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ, పాతపటి సర్రాజు మృతికి శాసనసభ తీవ్ర సంతాపాన్ని తెలియజేసింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచింది. మాజీ సభ్యుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కొద్దిసేపు శాసనసభలోని సభ్యులు మౌనం పాటించారు.