మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
2 Dec, 2020 09:36 IST
అసెంబ్లీ: ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లును విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ప్రవేశపెట్టారు. అదే విధంగా దిశా బిల్లును హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రవేశపెట్టారు. అసైన్డ్ ల్యాండ్ బిల్లును డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టారు. ఇవాళ సభలో 11 బిల్లులు చర్చకు రానున్నాయి. పోలవరం, కరోనా కట్టడి, బీసీ కార్పొరేషన్లపై శాసనసభలో చర్చించనున్నారు.