ఈనెల 24 వరకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
14 Mar, 2023 12:32 IST
అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ప్రారంభమైన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 24వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. తొమ్మిది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈనెల 16వ తేదీన శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. సమావేశానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, చీఫ్ విప్ ప్రసాదరాజు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రతిపక్ష సభ్యులు అచ్చెన్నాయుడు హాజరయ్యారు.