ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
14 Mar, 2023 10:19 IST
అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయ గీతంతో సభను ప్రారంభించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. సమావేశాలకు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, లీడర్ ఆఫ్ ది హౌస్, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు, అధికార సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు హాజరయ్యారు. అంతకుముందు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సీఎం వైయస్ జగన్ ఘనస్వాగతం పలికారు.