లోకాయుక్త వార్షిక నివేదికలు సీఎం వైయస్ జగన్‌కు అందజేత
13 Mar, 2023 18:46 IST
తాడేపల్లి: 2020-21, 2021-22 సంవత్సరాలకు సంబంధించిన ఏపీ లోకాయుక్త వార్షిక నివేదికలను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి లోకాయుక్త జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డి అందజేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కలిసిన జస్టిస్ లక్ష్మణరెడ్డి, రిజిస్ట్రార్ టి. వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్ సీహెచ్. పోలయ్య లోకాయుక్త వార్షిక నివేదికలను అందజేశారు.