నెల్లూరులో వైయస్ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్ ఖాయం
నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమైందని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరులో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. శుక్రవారం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ 54వ డివిజన్ అభ్యర్థి షఫియా బేగంతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఇస్లాంపేట, భగత్‌సింగ్ కాలనీల్లో ఒక్క ఇల్లు కూడా తొలగించమని స్పష్టం చేశారు. టీడీపీ, సీపీఎం నేతల దుష్ప్రచారాలను నమ్మొద్దని అన్నారు. ఆ పార్టీలకు ఓటేసినా ఉపయోగం లేదని, ఆ విషయాన్ని టీడీపీ నేతలే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఓటు చాలా విలువైనదని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి తెలిపారు.