రాజకీయ ఉనికి కోసమే పవన్ తాపత్రయం
26 Sep, 2021 19:03 IST
నెల్లూరు: రాజకీయ ఉనికి కోసమే పవన్ తాపత్రయ పడుతున్నాడని మంత్రి అనిల్ కుమార్‌యాదవ్ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ నటించినా, మరే ఇతర నటుడు నటించినా కష్టం అనేది ఒకటే అని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆన్లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చించారని తెలిపారు. ఆన్లైన్ పోర్టల్ అంటే ఎందుకంత భయమని సూటిగా ప్రశ్నించారు. దాని వల్ల జరిగే నష్టం ఏమిటని నిలదీశారు. తన ఒక్కడి కోసం చిత్రసీమను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పవన్ కల్యాణ్ మాట్లాడడం సరికాదని దుయ్యబట్టారు. ఇది పవన్ కల్యాణ్ క్రియేషన్ అని, చిత్రపరిశ్రమను ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.