ఫిలిప్ సి. థోచర్ వైయస్ఆర్ సీపీలో చేరిక
17 Jun, 2021 19:06 IST
తాడేపల్లి: ఆంగ్లో ఇండియన్ మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి. థోచర్ వైయస్ఆర్ సీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి.. సీఎం సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు ఫిలిప్ సి. థోచర్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు కత్తెర సురేష్, కత్తెర హెన్రీ క్రిస్టినా ఉన్నారు.