ఏపీ రెడ్డి సంఘాల సమాఖ్య 2026 నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ
తాడేపల్లి: వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర డైరీని మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 40 రెడ్డి సంఘాల సమాచారాన్ని సమగ్రంగా క్రోడీకరించి ఈ డైరీని రూపొందించడం విశేషం.
ఈ సందర్భంగా సంఘాల మధ్య ఐక్యత, సమన్వయం పెంపొందించడంలో ఇలాంటి ప్రయత్నాలు కీలక పాత్ర పోషిస్తాయని నాయకులు తెలిపారు. సామాజిక సేవలు, అభివృద్ధి కార్యక్రమాల్లో రెడ్డి సంఘాల పాత్రను మరింత బలోపేతం చేసేలా ఈ డైరీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంగళగిరి వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఏపీ రెడ్డి సంఘాల సమాఖ్య ప్రెసిడెంట్ కె. వెంకట క్రిష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎల్. కొండారెడ్డి, ట్రెజరర్ డాక్టర్ ఎం. సుబ్బిరెడ్డి సహా పలువురు రెడ్డి సంఘాల ఆఫీస్ బేరర్లు హాజరయ్యారు.