పోర్ట్ ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఏపీకి అవార్డు
8 Sep, 2022 12:45 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు దక్కింది. పోర్ట్ ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఏపీకి ఈ అవార్డు వరించింది. దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు నేతృత్వంలో జ్యూరీ ఆంధ్రప్రదేశ్‌ను అవార్డుకు ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి గుడివాడ అమర్నాథ్ అవార్డు అందుకోనున్నారు. ఏపీకి అవార్డు రావడం పట్ల మంత్రి గుడివాడ అమర్నాథ్ సంతోషం వ్యక్తం చేశారు.