రాజమహేంద్రవరం ఘటనపై చలించిన సీఎం వైయస్ జగన్
8 Sep, 2022 12:21 IST
తాడేపల్లి: లోన్ యాప్‌ల ఆగడాల కారణంగా రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి ఇద్దరి చిన్నారులు నాగసాయి (4), లిఖిత శ్రీ(2)లు అనాధలుగా మిగిలారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. అనాధలుగా మారిన చిన్నారులు ఇద్దరికి చెరో రూ.5లక్షల సహాయం అందజేయాలని జిల్లా కలెక్టర్ కె.మాధవీలతకి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
లోన్ యాప్‌ల ఆగడాలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి లేని లోన్‌యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు అధికారులకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.