సచివాలయ వ్యవస్థతో ఏపీకి జాతీయ ర్యాంకులు
2 Oct, 2020 18:54 IST
అమరావతి : జాతీయ స్థాయిలో ఏపీకి అవార్డులు రావడం వెనుక ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి ఎంతో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ మంచి సత్ఫలితాలనిచ్చింది. సచివాలయ వ్యవస్థతోనే జాతీయ ర్యాంకులు సాధ్యమైన వేళ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. కేంద్రం శుక్రవారం స్వచ్చ భారత్ దివస్‌కు సంబంధించిన జాతీయ అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ గ్రామీణ్‌లో రాష్ట్రానికి తొలిసారి మూడు అవార్డులు లభించాయి. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో స్వచ్ఛ సుందర్ సముదాయక్ శౌచాలయ కేటగిరీలో రెండో ర్యాంకు, సముదాయక్ శౌచాలయ అభియాన్ కేటగిరీలో మూడవ ర్యాంక్, దీంతో పాటు గంధగి ముక్త్ భారత్ కేటగిరీలో మూడవ ర్యాంక్ లభించింది. కాగా గతంలో ఎన్నడూ రాష్ట్రానికి ఇన్ని ర్యాంకులు దక్కలేదు.